DET:NOV 22:
సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్:
బాలీవుడ్‌లో కొత్త, ఆసక్తికరమైన జోడీ సెట్ అయింది! ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో వస్తున్న కొత్త రొమాంటిక్ డ్రామా దో దీవానే సెహర్ మే లో సిద్ధాంత్ చతుర్వేది మరియు మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నదాని ప్రకారం ఈ జోడీ స్క్రీన్‌పై చాలా ఫ్రెష్‌గా చూడటానికి బాగుంటుందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని తెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంజయ్ లీలా భన్సాలీ ప్రొడక్షన్‌లో లవ్ స్టోరీ:
సాధారణంగా గ్రాండ్‌గా విజువల్‌గా అద్భుతంగా ఉండే సినిమాలు తీసే సంజయ్ లీలా భన్సాలీ. ఈసారి ఒక ఇంపర్ఫెక్ట్లీ పర్‌ఫెక్ట్ ప్రేమకథను అందిస్తున్నారట. అంటే ఈ సినిమాలో కథానాయకుడు శశాంక్ మరియు కథానాయిక రోషిణిల ప్రేమకథ అన్ని విధాలుగా పర్‌ఫెక్ట్‌గా ఉండదు, కానీ అది చాలా నిజాయితీగా హృదయానికి హత్తుకునేలా ఉంటుందట. ఈ సినిమాను రవి ఉద్యవార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన గతంలో శ్రీదేవి నటించిన ‘మామ్’ లాంటి సినిమాలను తీశారు.

విడుదల తేదీ మరియు నేపథ్య సంగీతం:
దో దీవానే సెహర్ మే చిత్రం 2026 సంవత్సరం ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది. వాలెంటైన్స్ డే వారంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు సంగీతం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయని, పాతకాలపు ప్రేమకథలను గుర్తు చేసే మధురమైన మెలోడీస్, అలాగే ఆధునిక మ్యూజిక్ కలగలిపి ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. అంటే మ్యూజిక్ విషయంలో కూడా భన్సాలీ మార్క్ కచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ లవ్ స్టోరీ ఒక వార్మ్ హగ్ లాగా చాలా సింపుల్‌గా, స్వచ్ఛంగా, హాయిగా ఉంటుందని టీమ్ చెబుతోంది.

సిద్ధాంత్ చతుర్వేది ఎమోషనల్ నోట్:

సిద్ధాంత్ చతుర్వేది ఈ సినిమా గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైనది. నిజం చెప్పాలంటే షూటింగ్ సమయంలో నేను వ్యక్తిగతంగా కొన్ని కష్టాల గుండా వెళ్లాను. ఈ ప్రయాణం నన్ను ఎంతో కొంత నయం చేసింది. ఇది మీకు కూడా అదే చేస్తుందని ఆశిస్తున్నాను” అని రాశాడు. పర్‌ఫెక్ట్ అంటూ ఏమీ లేదు, పోరాడదగిన ఒక ఇంపర్‌ఫెక్ట్ వ్యక్తి ఉంటే చాలు. ప్రేమతో నిండిన మా అత్యంత బలహీనమైన స్థితిని, పర్‌ఫెక్ట్ కాని ఆ లవ్ స్టోరీని మీరంతా థియేటర్లలో చూడండి” అని సిద్ధాంత్ తెలిపారు.