Sam C.S. Completes 100 Films with Sardar 2.. “Failures Taught Me More Than Anything”

D News: ప్రముఖ సంగీత దర్శకుడు Sam C.S. సంగీత దర్శకుడిగా తన 100వ సినిమాను పూర్తి చేసుకున్నారు. కార్తీ నటించిన ‘సర్దార్ 2’ ఆయన కెరీర్‌లో ఈ మైలురాయిని అందించిన చిత్రం. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకులు మెచ్చే సంగీతం అందించడమే తనకు ముఖ్యమని చెప్పారు.

వైఫల్యాలే ఎన్నో పాఠాలు నేర్పాయి

తాను పనిచేసిన ప్రతి సినిమా విజయవంతం కాలేదని, కానీ ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒక విషయాన్ని నేర్పిందని Sam C.S. తెలిపారు. ముఖ్యంగా వైఫల్యాలు తనను మరింత మంచి సంగీతకారుడిగా తీర్చిదిద్దాయని చెప్పారు.

‘ఖైదీ’, ‘వనంగాన్’ వంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించడం తన కెరీర్‌లో ప్రత్యేక అనుభవమని పేర్కొన్నారు. ఎక్కువగా కొత్త దర్శకులతో కలిసి పనిచేశానని, వారు కొత్త ఆలోచనలతో రావడం వల్ల సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసే అవకాశం దక్కిందన్నారు.

తనకు ఇప్పటికీ తొలి సినిమానే గుర్తుందని, 35వ సినిమా, 50వ సినిమా వంటి నంబర్లు మాత్రం గుర్తులేవని Sam C.S. చెప్పారు. సంగీతమే తనకు ప్రాణమని, నిద్రపోయే సమయం మినహా ఎక్కువ సమయాన్ని సంగీతానికే కేటాయిస్తానని తెలిపారు.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana