
మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి నెలకొంది. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు సాయి దుర్గా తేజ్‌కు అత్యంత సన్నిహితులైన స్నేహితులు హాజరై సందడి చేశారు.
సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి సంబంధించిన ప్రత్యేక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు పలువురు మెగా కుటుంబ సభ్యులు ఈ ఫొటోను షేర్ చేస్తూ కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఫొటోలో సాయి దుర్గా తేజ్, కిరణ్మయి నిశ్చితార్థపు పూల దండలు ధరించి కూర్చున్నారు. వారి చుట్టూ మెగా కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు కనిపించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, అకిరా నందన్, స్నేహ రెడ్డి, అల్లు బాబీ, అల్లు శిరీష్, నిహారిక, నయానిక, వైష్ణవ్ తేజ్, ఆద్య, సుస్మిత, శ్రీజ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
చాలా కాలం తర్వాత మెగా కుటుంబంలోని కజిన్స్ అందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక ఫొటోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. మరోవైపు సాయి దుర్గా తేజ్‌కు అభినందనలు తెలుపుతూ, ఆయన కొత్త జీవితానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
మొత్తానికి మెగా కుటుంబంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుక అభిమానులకు డబుల్ ట్రీట్‌గా మారింది. ఒకవైపు సాయి దుర్గా తేజ్ పెళ్లి వార్త, మరోవైపు మెగా కజిన్స్ అందరూ కలిసి కనిపించడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
