
DET:MAR 09:
కథా నేపథ్యం:
వరలక్ష్మీ శరత్‌కుమార్ ఒక నగరంలో నర్సుగా పనిచేస్తుంటుంది.ఒక రోజు స్కూల్ నుంచి తన 12 ఏళ్ల కుమార్తె సరస్వతిని తీసుకురావడానికి వెళ్లిన ఆమెకు తన బిడ్డ కనిపించకుండా పోయిందని తెలిసి షాక్ తింటుంది.పోలీసుల సహాయం కోరినా ఫలితం లేకపోవడంతో ఒక నిజాయితీ గల న్యాయవాది ప్రకాష్ రాజ్ సహాయంతో చట్టపరమైన పోరాటం మొదలుపెడుతుంది.ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు సరస్వతి ఎందుకు మాయమైంది? అనేదే ఈ సినిమా కథ.
ఎలా ఉందంటే?
వరలక్ష్మీ శరత్‌కుమార్ తన తొలి దర్శకత్వ ప్రయత్నంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ముఖ్యంగా చిన్న పిల్లల భద్రతను ప్రధానాంశంగా ఎంచుకున్నారు.సినిమా మొదటి భాగం చాలా ఆసక్తికరంగా,సస్పెన్స్‌తో సాగుతుంది.అయితే సెకండాఫ్‌లోకి వచ్చేసరికి కథనం కొంచెం నెమ్మదించి రొటీన్ రివెంజ్ డ్రామాగా మారుతుంది.పతాక సన్నివేశాల్లో వచ్చే డైలాగులు సందేశాత్మకంగా ఉన్నా అవి కొంత సాగదీసినట్లు అనిపిస్తాయి.స్క్రీన్‌ప్లేలో మరికొంత కొత్తదనం ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
సాంకేతిక అంశాలు:
ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది.సినిమాటోగ్రఫీ రియలిస్టిక్‌గా ఉంది. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా వేగం పెరిగేది.కథా రచయిత సాయి మాధవ్ బుర్ర మరియు వరలక్ష్మి మధ్య కథ మార్పుల విషయంలో వివాదం నెలకొన్నప్పటికీ సంభాషణలు మాత్రం కొన్ని చోట్ల చాలా బలంగా ఉన్నాయి.
ఫైనల్ వర్డిక్ట్:
ఎస్ సరస్వతి ఒక మంచి ఉద్దేశంతో తీసిన సామాజిక చిత్రం.వరలక్ష్మీ శరత్‌కుమార్ నటన కోసం మరియు ఆమె ఇచ్చిన సందేశం కోసం ఒకసారి చూడవచ్చు.
