
D Educt: Oct 4: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ల నిర్వహణకు రూ.24.50 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన 3,019 ప్రీ ప్రైమరీ సెక్షన్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆయా ప్రీ ప్రైమరీ సెక్షన్ల నిర్వహణతో పాటు సిబ్బంది వేతనాల చెల్లింపుల కోసం మొత్తం రూ.24.50 కోట్లను మంజూరు చేసింది.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఖాతాలకు నిధులు
ప్రీ ప్రైమరీ సెక్షన్ల నిర్వహణకు విడుదల చేసిన రూ.24.50 కోట్లను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. విడుదలైన నిధులను ప్రీ ప్రైమరీ సెక్షన్ల నిర్వహణ, సిబ్బంది వేతనాల కోసం వినియోగించనున్నారు.
