D Spiritual: Oct 4: యాదగిరిగుట్టలో శరన్నవరాత్రి ఉత్సవాలు.. పూజల టికెట్ ధరలు ఇవే

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలోని పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి.

ప్రత్యేక పూజలకు టికెట్ ధరలు

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గొనే భక్తుల కోసం ఆలయ అధికారులు టికెట్ ధరలను ప్రకటించారు. నవరాత్రి పూజకు రూ.1,116 టికెట్ ధరగా నిర్ణయించారు. ఈ టికెట్ ద్వారా ఒక దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. సప్తశతి పారాయణం, లక్ష కుంకుమార్చనకు రూ.116 చొప్పున టికెట్ ధర నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

రుద్ర హోమం తాత్కాలికంగా రద్దు

ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాల్లో రుద్ర హోమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. పూజా కార్యక్రమాల్లో చేసిన మార్పులను భక్తులు గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని ఈవో భవానీ శంకర్ కోరారు.

అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూజా కార్యక్రమాలు సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana