
DSports Jan05 2026: ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ, ఒక మ్యాచ్ ముగించుకుని తన కారులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
రోహిత్ కారులో వెళ్తుండగా, ఇద్దరు యువ అభిమానులు సెల్ఫీ కోసం ఆయన కారు వద్దకు వచ్చారు. రోహిత్ విండో లోంచి చేయి బయటపెట్టి వారికి అభివాదం చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆ అభిమానులు అత్యుత్సాహంతో రోహిత్ చేయిని గట్టిగా పట్టుకుని లాగడానికి ప్రయత్నించారు. ఈ అకస్మాత్తు చర్యతో రోహిత్ షాక్కు గురయ్యారు.
అభిమానుల ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రోహిత్, వారిని గట్టిగా హెచ్చరించారు. వెంటనే తన చేయిని వెనక్కి తీసుకుని కారు విండో మూసివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
