
D News: గడ్డం ప్రసాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. అసెంబ్లీలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం.. ప్రభుత్వపరంగా సంపూర్ణ అండగా ఉంటామని, బాధ్యులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు సమాచారం.
స్పీకర్ ఛాంబర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం
మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి సోమవారం జరిగిన పరిణామాలపై చర్చించారు.
బాధ్యులపై చర్యలు తప్పవన్న సీఎం
నిన్నటి ఘటనల పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం, ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్పీకర్ పదవి గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, బాధ్యులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
స్పీకర్ వ్యవస్థ గౌరవంపై ప్రభుత్వం స్పష్టం
రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి జరిగిన అవమానాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ వ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గదని ఆయన భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
సోమవారం ఘటనలపై కొనసాగుతున్న రాజకీయ దుమారం
అసెంబ్లీ తొలిరోజు బీఆర్ఎస్ నేతల నిరసనలతో ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అధికారపక్షం తీవ్రంగా స్పందించగా, ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
