
D Spiritual: Apr 27: చౌటకూరు రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు
చౌటకూరు మండల కేంద్రంలో వెలసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం నాలుగవ వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించగా, ముగింపు రోజైన ఆదివారం రేణుక ఎల్లమ్మ తల్లి–జమదగ్ని మహర్షి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం భారీ బోనాల ఊరేగింపు నిర్వహించగా, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
అమ్మవారి సేవలో ప్రముఖులు
ఉత్సవాలను తిలకించేందుకు పోసానిపల్లి, సరాప్పల్లి, సుల్తాన్పూర్, ఉప్పరిగూడెం, కోర్పోలు తదితర గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకలకు మాజీ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి, ఎంపీపీ మాజీ అధ్యక్షుడు భూంరెడ్డి సుభాష్ రెడ్డి, జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా జోగినాధ్, సర్పంచ్ పార్కల రాంరెడ్డిలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
