
DET:NOV 12:
రవితేజ కొత్త చిత్రం BMW – టైటిల్ గ్లింప్స్ విడుదల:
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 76వ సినిమా టైటిల్‌ను తాజాగా ప్రకటించారు.ఈ సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.ఈ టైటిల్‌ను అందరూ ముద్దుగా BMW అని పిలుస్తున్నారు.దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందిస్తున్న ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది.రవితేజ మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు,వైవాహిక జీవితంలోని ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.
సంక్రాంతి రేస్‌లో BMW:
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాన్ని వచ్చే ఏడాది 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.సంక్రాంతి అంటేనే తెలుగు సినీ ప్రేక్షకులకు పండుగ వాతావరణం,ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు గుర్తుకొస్తాయి.రవితేజ తనదైన కామెడీ,ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమాతో పండుగ బరిలో నిలవడం అభిమానులకు మంచి జోష్ ఇస్తోంది.
కథాంశం,నటీనటులు:
ఈ సినిమాలో రవితేజ రామసత్యనారాయణ అనే పాత్రలో కనిపించనున్నారు.జీవితంలో ఇద్దరు ఆడవాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరకక ఇబ్బంది పడే భర్తగా ఆయన పాత్ర ఉంటుందని గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.రవితేజ చెప్పే వాయిస్ ఓవర్,ముఖ్యంగా గూగుల్,ఏఐ,చాట్ జీపీటీ,జెమినీ అన్నింటిని అడిగాను.వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి,అంటూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది.ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్,డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు.సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్:
దర్శకుడు కిషోర్ తిరుమల గతంలో నేను శైలజ,చిత్రలహరి వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు.ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.వినోదభరితమైన కుటుంబ కథా చిత్రాలు సంక్రాంతికి మంచి విజయాన్ని సాధిస్తాయి కాబట్టి,రవితేజ ఈ BMW సినిమాతో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం.
