DET:DEC 04:
రణ్‌వీర్ సింగ్ అభిమానులకు చేదు వార్త ఫిర్యాదు నమోదు!
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ పేరు మళ్ళీ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఆయనపై తాజాగా ఒక ఫిర్యాదు నమోదు కావడంతో ఆయన తదుపరి సినిమా ధురంధర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే అంశం. ఈ ఫిర్యాదు వెనుక ఉన్న అసలు కారణం గోవాలో జరిగిన ఒక అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో IFFI కాంతార సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆపై ఆ సినిమాలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని అనుకరించడం.

కాంతార దైవంపై చేసిన వ్యాఖ్యలే వివాదానికి కారణం:
ఈ మొత్తం వివాదం రణ్‌వీర్ సింగ్ కాంతార సినిమాలోని దైవ నర్తనం భూత కోల సన్నివేశం గురించి వేదికపై మాట్లాడిన తీరు దాన్ని అనుకరించిన విధానం నుంచే మొదలైంది. ఆ వేడుకలో రణ్‌వీర్, కాంతార నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టిని పొగుడుతూ ఆ దైవ నర్తనాన్ని గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఆ దైవాన్ని ఆడ దెయ్యంగా అభివర్ణించడమే కాకుండా ఆ సన్నివేశాన్ని నవ్వుతూ అనుకరించారు. కన్నడ నట మరియు తుళు మాట్లాడే ప్రజలు అత్యంత భక్తితో కొలిచే దైవంను అవమానించారని ఇది తమ మత విశ్వాసాలను మనోభావాలను దెబ్బతీసిందని కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఫిర్యాదులు మరియు కేసు నమోదు డిమాండ్:
రణ్‌వీర్ వ్యాఖ్యలపై వెంటనే అభ్యంతరాలు మొదలయ్యాయి. కర్ణాటకలోని బెంగుళూరుకు చెందిన ఒక న్యాయవాది ప్రశాంత్ మెటల్, రణ్‌వీర్ సింగ్‌పై హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాక హిందూ జనజాగృతి సమితి వంటి మరికొన్ని హిందూ సంస్థలు కూడా రణ్‌వీర్‌పై గోవాలో ఫిర్యాదు చేశాయి. రణ్‌వీర్ చర్యలు హిందువుల మత మనోభావాలను గాయపరిచాయని ఫిర్యాదులలో పేర్కొన్నారు. అతనిపై తక్షణమే కేసు నమోదు చేయాలని FIR డిమాండ్ చేశారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని సమాచారం. ఈ ఫిర్యాదుల్లో రణ్‌వీర్ సింగ్ ధురంధర్ నటుడిగా కూడా ప్రస్తావించబడ్డారు.

రణ్‌వీర్ సింగ్ క్షమాపణ పశ్చాత్తాపం వ్యక్తం:

వివాదం పెద్దది అవుతున్న నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా వెంటనే క్షమాపణలు తెలిపారు. కాంతార నటుడి అద్భుత ప్రదర్శనను హైలైట్ చేయడమే తన ఉద్దేశమని దేశంలోని ప్రతీ సంస్కృతి, సంప్రదాయంపై తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన వివరించారు. తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా బాధించి ఉంటే దానికి తాను నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నానని రణ్‌వీర్ తెలిపారు. అయితే ఈ క్షమాపణ తర్వాత కూడా ఫిర్యాదులు నమోదు కావడం గమనార్హం.