
DET:DEC 06:
ధురందర్ పార్ట్ 2 విడుదల తేదీ ఖరారు!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన భారీ యాక్షన్-స్పై థ్రిల్లర్ ధురందర్ సినిమా డిసెంబర్ 5, 2025న విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్కంఠభరితమైన కథాంశంతో, రణ్వీర్ నటనతో ఈ చిత్రం అంచనాలను అందుకుంది. అయితే సినిమా చివర్లో ధురందర్ రెండు భాగాలుగా వస్తుందని స్పష్టం చేయడంతో అభిమానుల్లో రెండో భాగంపై మరింత ఆసక్తి పెరిగింది.
ఆ రోజునే విడుదల మార్చి 19, 2026:
ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. సినిమా క్రెడిట్స్ పూర్తయిన తర్వాత రెండో భాగం అయిన ధురందర్ పార్ట్ 2 – రివెంజ్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ స్పై యాక్షన్ సాగా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ విడుదల తేదీని ఈద్ పండుగ సందర్భంగా ఖరారు చేశారు.
బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ!
ధురందర్ పార్ట్ 2 విడుదలైన మార్చి 19, 2026న బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ ఉండే అవకాశం ఉంది. ఆ రోజున, కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ Toxic: A Fairytale for Grown-Ups బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్ నటించిన ధమాల్ 4 సినిమాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో ఈ మూడు భారీ సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది.
కథాంశం మరియు నటీనటులు:
పాకిస్తాన్ అండర్‌వరల్డ్‌లో ఒక భారతీయ గూఢచారి చొరబడి చేసే సాహసోపేతమైన ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా కథ నడుస్తుంది. తొలి భాగంలో రణ్వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి పెద్ద స్టార్ కాస్ట్ నటించారు. ఈ సెకండ్ పార్ట్‌లో కూడా అదే ఉత్సాహాన్ని, యాక్షన్‌ను మరింత పెంచి ప్రేక్షకులను మెప్పించడానికి టీమ్ సిద్ధమవుతోంది.
