
DET:FEB 14:
3 ఇడియట్స్ సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్:
భారతీయ చలనచిత్ర చరిత్రలో విద్యా వ్యవస్థపై వ్యంగ్యంగా సాగి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా 3 ఇడియట్స్.ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో హిరానీ మాట్లాడుతూ 3 ఇడియట్స్ సీక్వెల్ గురించి ఇటీవల ఒక అద్భుతమైన ఐడియా తట్టింది.ఇది అనుకోకుండా వచ్చిన ఆలోచన.ప్రస్తుతం దీనిపై పని చేస్తున్నాము అని తెలిపారు.ఈ వార్త విన్న అభిమానులు అమీర్ ఖాన్,మాధవన్,శర్మాన్ జోషి మళ్లీ కలిసి కనిపిస్తారని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
మున్నా భాయ్ 3 ఎప్పుడు మొదలవుతుంది?
సంజయ్ దత్,అర్షద్ వార్సీ కాంబినేషన్లో వచ్చిన మున్నా భాయ్ సిరీస్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మూడవ భాగం కోసం ప్రేక్షకులు దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు.దీనిపై హిరానీ స్పందిస్తూ మున్నా భాయ్ 3 కోసం నా దగ్గర ఒక మంచి కథ ఉంది.చాలా వరకు స్క్రిప్ట్ పూర్తయింది.అయితే దానికి సరైన ముగింపు కోసం వెతుకుతున్నాను.పర్ఫెక్ట్ క్లైమాక్స్ దొరికిన వెంటనే సినిమా పనులు వేగవంతం చేస్తాను అని చెప్పారు.
హిరానీ చేతిలో వరుస ప్రాజెక్టులు:
ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరానీ దగ్గర మూడు నుంచి నాలుగు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయట.డంకీ సినిమా తర్వాత ఆయన ఏ సినిమాను పట్టాలెక్కిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఒకవైపు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మరోవైపు రణబీర్ కపూర్‌తో ఒక క్రీడా నేపథ్యం ఉన్న సినిమా గురించి చర్చలు జరుగుతున్నప్పటికీ 3 ఇడియట్స్ 2 లేదా మున్నా భాయ్ 3 వీటిలో ఏదో ఒకటి త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం.
అభిమానుల్లో మొదలైన ఉత్సాహం:
ఈ అప్డేట్స్ రావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ముఖ్యంగా 3 ఇడియట్స్ సీక్వెల్లో పాత తారాగణం ఉంటుందా లేక కొత్త నటీనటులతో తీస్తారా అనే సస్పెన్స్ నెలకొంది.ఏదేమైనా హిరానీ మార్క్ కామెడీ మరియు ఎమోషన్స్ మరోసారి వెండితెరపై చూడబోతున్నామనే వార్త సినీ ప్రియులకు పెద్ద పండగ లాంటిదే.
