
DET:DEC 18:
శ్రీకాంత్ వారసుడి కోసం రంగంలోకి రామ్ చరణ్:
మెగా కుటుంబానికి సీనియర్ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.గతంలో మెగాస్టార్ చిరంజీవి,శ్రీకాంత్ కలిసి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.ఇప్పుడు అదే స్నేహాన్ని కొనసాగిస్తూ శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక కెరీర్‌కు తన వంతు మద్దతు ఇచ్చేందుకు రామ్ చరణ్ ముందుకు వచ్చారు.రోషన్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ ట్రైలర్‌ను చరణ్ విడుదల చేయనున్నారు.
ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్:
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను డిసెంబర్ 18న హైదరాబాద్‌లో ఎంతో వేడుకగా నిర్వహించనున్నారు.చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గిర గిర పాట సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ దక్కించుకుంది.ఇప్పుడు రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కానుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్:
ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.స్వాతంత్ర్యానికి పూర్వం సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఫుట్‌బాల్ క్రీడ ఆధారంగా ఈ కథ రూపొందింది.ఇందులో రోషన్ సరసన మలయాళ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది.వైజయంతీ మూవీస్,స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
క్రిస్మస్ కానుకగా విడుదల:
మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.చరణ్ స్వయంగా పెద్ది అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న తరుణంలో,మరో స్పోర్ట్స్ మూవీ అయిన ఛాంపియన్ ట్రైలర్‌ను ఆయన లాంచ్ చేయడం విశేషం.ఈ ఈవెంట్ ద్వారా చిత్ర బృందం ప్రమోషన్లలో వేగాన్ని పెంచాలని ప్లాన్ చేస్తోంది.
