DET:FEB 24:
జైలు నుండి మేనకోడలి పెళ్లికి:
గత కొంతకాలంగా చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న రాజ్‌పాల్ యాదవ్ ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.అయితే తన మేనకోడలు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఢిల్లీ హైకోర్టు ఆయనకు మార్చి 18 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందిన వెంటనే ఆయన ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి చేరుకున్నారు.

మేనకోడలి విడ్కోలులో భావోద్వేగం:

పెళ్లి వేడుకల్లో భాగంగా తన మేనకోడలిని సాగనంపే సమయంలో రాజ్‌పాల్ యాదవ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.తన మేనకోడలిని హత్తుకుని ఆయన కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి.జైలు కష్టాలు కోర్టు కేసులు ఒకవైపు ఉన్నా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అక్కడి వారు కూడా ఉద్వేగానికి గురయ్యారు.

వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియోలు:
ఒకవైపు భావోద్వేగ క్షణాలు ఉన్నప్పటికీ పెళ్లి వేడుకల్లో రాజ్‌పాల్ యాదవ్ సందడి కూడా చేశారు.సంగీత్ వేడుకలో తన భార్య రాధా యాదవ్‌తో కలిసి ఆయన ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.సల్మాన్ ఖాన్ నటించిన తేరీ చునరియా పాటకు ఆయన వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్ అయ్యాయి.కష్టాల్లో ఉన్నా తన కుటుంబం కోసం ఆయన నవ్వుతూ గడపడం గొప్ప విషయం అని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం అప్పులు తీర్చకుండా ఇలా వేడుకలు చేసుకోవడంపై విమర్శలు చేస్తున్నారు.

రూ. 9 కోట్ల అప్పు వివాదం ఏమిటి?
2010లో రాజ్‌పాల్ యాదవ్ అతా పతా లాపతా అనే సినిమాను నిర్మించేందుకు ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారి దగ్గర రూ 5 కోట్లు అప్పు తీసుకున్నారు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో ఆయన ఆ డబ్బును తిరిగి చెల్లించలేకపోయారు.వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ.9 కోట్లకు చేరింది.ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో కోర్టులో కేసులు నమోదయ్యాయి.ఈ కేసులోనే కోర్టు ఆయనకు శిక్ష విధించింది.