Rajinikanth Enters the Tollywood Sankranti Race.. Set to Compete with the Star Heroes

D News : సంక్రాంతి సీజన్ అంటేనే టాలీవుడ్‌లో భారీ సినిమాల సందడి. 2027 సంక్రాంతి కోసం ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ సినిమాలతో సిద్ధమవుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ రేసులోకి వస్తున్నట్లు సమాచారం.

వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’ జనవరి 14న రిలీజ్ కానున్నట్లు సమాచారం. ‘సంబరాల ఏటిగట్టు’ కూడా ఇదే సీజన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

సంక్రాంతి రేసులో రజనీ

ఇప్పటికే టాలీవుడ్‌లో పలు క్రేజీ సినిమాలు పోటీ పడుతున్న సమయంలో.. రజనీకాంత్ కూడా సంక్రాంతి బరిలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ధర్మన్’ను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో రామ్ పోతినేని కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై తమిళంతో పాటు తెలుగులోనూ ఆసక్తి నెలకొంది.

ఇలా ఒకే సంక్రాంతి సీజన్‌లో వెంకటేష్–కళ్యాణ్ రామ్, చిరంజీవి, శర్వానంద్‌తో పాటు రజనీకాంత్ సినిమాలు బరిలో నిలిస్తే.. థియేటర్ల కేటాయింపు, రిలీజ్ డేట్ల విషయంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాల విడుదల తేదీల్లో భవిష్యత్తులో మార్పులు చోటుచేసుకునే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.

By Avinash