DET:OCT 25:
రజనీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్:శృతి హాసన్,సౌందర్య రజనీకాంత్ ధృవీకరణ:
ప్రారంభంలో శుభాకాంక్షలు ఇటీవల జరిగిన ఒక అవార్డు వేడుకలో నటి శృతి హాసన్ మరియు దర్శకురాలు సౌందర్య రజనీకాంత్‌లు వేదికపైకి వచ్చారు.ఈ సందర్భంగా వారి తండ్రులు,సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి చేయబోయే సినిమా గురించి అడగగా,శృతి హాసన్ మొదటగా స్పందిస్తూ,ఈ కాంబో చూడాలని మేమూ మీలాగే ఎదురుచూస్తున్నాం ఇది మాకు కూడా చాలా ఇష్టం అని నవ్వుతూ చెప్పారు.

సౌందర్య రజనీకాంత్ ధృవీకరణ:
సౌందర్య రజనీకాంత్ ఈ ప్రాజెక్ట్ గురించి మరింత స్పష్టమైన అప్‌డేట్ ఇచ్చారు.వారిద్దరి కలయిక గురించి అధికారిక ప్రకటన మా నాన్నలు ఇస్తేనే బాగుంటుంది.కానీ,నాన్న రజనీకాంత్ కమల్ అంకుల్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లో సినిమా చేస్తారన్నది నిజం.ఆ సినిమా ఎలా ఉండాలి,దర్శకుడు ఎవరు అనే విషయాలు ఇంకా చర్చల దశలో ఉన్నాయి.సరైన సమయం వచ్చినప్పుడు,తలైవా రజనీకాంత్ స్వయంగా వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తారు అని సౌందర్య తెలిపారు.

శృతి,రజనీకాంత్ అనుభవం:
ఇటీవల రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాలో కలిసి పనిచేసిన అనుభవాన్ని శృతి హాసన్ పంచుకున్నారు. “నేను రజనీ సార్‌తో కూలీలో పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను.మా నాన్నలకు పరిచయం ఉండటం వల్ల కాదు,అది నిజంగా అద్భుతమైన అనుభవం అని చెప్పారు.అలాగే,తమ కుటుంబాల మధ్య అనుబంధం గురించి మాట్లాడుతూ,తరచుగా కలవకపోయినా,కలిసిన ప్రతిసారీ చాలా సానుకూలత, పరస్పర గౌరవం ఉంటాయని పేర్కొన్నారు.

మునుపటి ప్రకటన,దర్శకుడి గురించి చర్చ:
ఈ సినిమాకు సంబంధించి గతంలోనే రజనీకాంత్ కూడా ఒక ప్రకటన చేశారు. “తరువాత నేను రాజ్ కమల్,రెడ్ జెయింట్ కలిసి నిర్మించే ఒక సినిమాలో నటిస్తాను.దర్శకుడు ఇంకా నిర్ణయించబడలేదు.కమల్ హాసన్‌తో కలిసి నటించాలని నేను కోరుకుంటున్నాను.అందుకు సరైన కథ,పాత్ర దొరికితే తప్పకుండా కలిసి నటిస్తాం” అని రజనీకాంత్ గతంలో చెప్పారు.ఈ భారీ మల్టీస్టారర్‌కు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నప్పటికీ, అధికారికంగా మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana