DNews: Dec 03: తెలంగాణలో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడగా వెంటనే ఆగిపోయాయి. తెలంగాణ వెదర్‌మాన్ ఎక్స్ ప్రకారం, హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణలో వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర తెలంగాణలో వాతావరణం మరింత చల్లబడనుందని హెచ్చరించారు. ఇప్పటికే చలితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మరింత చలిని ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్ష సూచనలు ఉన్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, తమిళనాడు, కేరళ, తీర ఆంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ (బుధవారం) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో చలి వాతావరణం మరో నాలుగు రోజుల పాటు కొనసాగనుందని వెల్లడించారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లో 4, 5 తేదీల్లో చలి కొనసాగుతుందని, ఉత్తర రాజస్థాన్‌లో 4 నుండి 6 వరకు, జార్ఖండ్‌లో 6, 7 తేదీల్లో చలి వాతావరణం కొనసాగుతుందని తెలిపారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana