
D Educt: Oct 8: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 3,548 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 6 వరకు కొనసాగనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇతర అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.
