
DET:MAR 18:
అమాయకత్వం మరియు నిరాడంబరత:
షూటింగ్ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ ప్రవర్తన గురించి రాశీ మాట్లాడుతూ.. ఆయన ఒక పవర్‌ఫుల్ పర్సనాలిటీ అయినప్పటికీ సెట్స్‌లో చాలా సింపుల్‌గా ఉంటారు.ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు.ఆయనలో ఒక రకమైన అమాయకత్వం ఉంటుంది అది మాటల్లో చెప్పలేం అని ప్రశంసించారు.
IAS ఆఫీసర్ కావాలనుకున్నా..
తమ మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ రాశీ ఒక విషయాన్ని పంచుకున్నారు.షూటింగ్ మొదటి రోజే పవన్ కళ్యాణ్ ఆమెను నువ్వు ఎప్పుడూ నటినే కావాలనుకున్నావా? అని అడిగారట.దానికి ఆమె స్పందిస్తూ.. లేదు సార్ నేను నిజానికి IAS ఆఫీసర్ కావాలనుకున్నాను అని చెప్పారట.ఆ మాట విన్న పవన్ ఆమెను మెచ్చుకుంటూ.. పబ్లిక్ సర్వీస్ చేయమని ప్రోత్సహించారని ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఎంతో విలువ ఉంటుందని ఆమె తెలిపారు.
మానవత్వం గురించి..
ఆయన ఎప్పుడూ ప్రజల గురించి సమాజం గురించి ఆలోచిస్తూ ఉంటారు.ఆయనతో మాట్లాడటం వల్ల మానవత్వం అంటే ఏమిటో నేను చాలా నేర్చుకున్నాను అని రాశీ ఎమోషనల్ అయ్యారు.పవనిజం అంటే కేవలం క్రేజ్ మాత్రమే కాదని అది ఒక సిద్ధాంతమని ఆమె అభిప్రాయపడ్డారు.
సినిమా విశేషాలు:
ఉస్తాద్ భగత్ సింగ్ రేపు మార్చి 19,2026న ఉగాది సందర్భంగా విడుదల కాబోతోంది.ఇందులో రాశీ ఖన్నా శ్లోక అనే మోడ్రన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తున్నారు.ఈ సినిమాలో ఆమె ఒక మాస్ సాంగ్‌లో డ్యాన్స్ చేశారు ఇది తనకు చాలా ఇష్టమైన పార్ట్ అని చెప్పారు.
