Pushpa Range Smuggling: Red sandalwood in a tractor tanker-DTv Telangana

DNews: Feb12: సినీ ఫక్కీలో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా,ట్రాక్టర్ ట్యాంకర్ లో రూ. 1.65 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, రవాణా చేసిన ట్రాక్టర్ సీజ్ఇద్దరు అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్స్ మరియు ఇద్దరు చిత్తూరు జిల్లా వాసులు అరెస్ట్.

కేసు వివరాలు:-

రెడ్ శాండల్ టాస్క్ ఫోర్సు హెడ్ శ్రీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్, వారి సూచనలమేరకు SP శ్రీ పీ.శ్రీనివాస్ ఐపీఎస్., వారి పర్యవేక్షణలో ASP J. కులశేఖర్ గారి మార్గదర్శకములో టాస్క్ ఫోర్సు సిబ్బంది కి రాబడిన సమాచారం మేరకు ఈ దినం అనగా 11.02.2026 వ తేదీన తెల్లవారి జామున అటవీ సిబ్బంది తో కలసి అన్నమయ్య జిల్లా, T. సుండుపల్లి మండలం పించా ప్రాజెక్ట్ సమీపములో చేరు సరికి అక్కడ ఒక ట్రాక్టర్ నిలపబడి వుండి సదరు ట్రాక్టర్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఎర్ర చందనం దుంగలు లోడ్ చేస్తూ ఉండగా. అది గమనించిన టాస్క్ ఫోర్సు పోలీసు లు వారిని వెంబడించి నలుగురిని పట్టుకోగా మిగిలిన వారు పారిపోయినారు. అంతట టాస్క్ ఫోర్సు పోలీసులు సదురు నేర స్థలం పరిశీలించి పట్టుబడిన నలుగురు వ్యక్తులు తెచ్చిన ట్రాక్టర్ మరియు ట్యాంకర్ తో పాటు అందులో లోడ్ చేసిన 72 ఎర్రచందనం దుంగలును స్వాదినం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు ముద్దాయిలను విచారించగా ఇద్దరు తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కు చెందిన వారు మరియు ఇద్దరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించి ఈ కేసు లో వారిని అరెస్ట్ చేయడమైనది.

ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోంది. పట్టుబడిన మొత్తం పట్టుబడిన 72 ఎర్రచందం దుంగల విలువ సుమారు 1.65 కోట్లు గా ఉంటుందని అంచనా.

ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన తిరుపతి టాస్క్ ఫోర్సు సిబ్బందిని టాస్క్ ఫోర్సు హెడ్ శ్రీ L. సుబ్బారాయుడు గారు అభినందించారు.

ఈ ఆపరేషన్ నందు పాల్గొన్న అధికారులు మరియు సిబ్బందికి రివార్డులు ప్రకటించడమైనది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana