
DNews: Feb03: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో పెద్ద షాక్ తగిలింది. ఢాకాలోని పూర్వాచల్ న్యూటౌన్ ప్రభుత్వ ప్రాజెక్టులో ప్లాట్ల కేటాయింపులో జరిగిన అవకతవకల కేసును విచారించిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. సంచలన తీర్పులో ఆమెకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండు వేర్వేరు కేసుల్లో ఆమెకు ఐదు సంవత్సరాల చొప్పున 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఢాకా ప్రత్యేక న్యాయమూర్తి కోర్టు న్యాయమూర్తి రబియుల్ ఆలం ఈ తీర్పును వెలువరించారు.
ఈ కేసులో షేక్ హసీనా మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కూడా దోషులుగా తేలారు. హసీనా మేనకోడలు మరియు ప్రస్తుత బ్రిటిష్ పార్లమెంటు సభ్యురాలు తులిప్ రిజ్వానా సిద్ధిక్ కూడా షాక్ తిన్నారు. రెండు కేసుల్లో ఆమెకు రెండేళ్ల చొప్పున నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. తులిప్ సిద్ధిక్ షేక్ హసీనా సోదరి షేక్ రెహానా కుమార్తె. ఆమె గతంలో బ్రిటన్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. హసీనా కుమారుడు రద్వాన్ ముజీబ్ సిద్ధిక్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో మరో నిందితురాలు అజ్మీనా సిద్ధిక్‌కు కూడా కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వారందరూ తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని కోర్టు స్పష్టం చేసింది.
