
D Educt: Nov 9: పీజీ వైద్య విద్య ప్రవేశాలకు ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల
వైద్య విద్యలో పీజీ కన్వీనర్ కోటా ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నవంబర్ 7న విడుదల చేసింది. నీట్ పీజీ-2026 ర్యాంకుల ఆధారంగా మొత్తం 3,518 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది.
విడుదల చేసిన మెరిట్ జాబితాపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ప్రవేశాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు సమర్పించాలని వర్సిటీ సూచించింది.
అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం వాటిని పరిశీలించి తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు కాళోజీ వర్సిటీ స్పష్టం చేసింది.
