కిర్గిజిస్థాన్‌లోని బిష్కెక్‌లో జరిగిన 26వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో సభ్య దేశాల అధినేతల మండలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రాంతీయ భద్రత, అనుసంధానం, ఆర్థికాభివృద్ధిపై భారత్‌ నిబద్ధతను స్పష్టం చేసిన ప్రధాని మోదీ ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం వంటి ఉమ్మడి సవాళ్లపై యూరేషియా దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రపంచ దేశాల నేతలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ మానవాళి “అంతులేని యుద్ధాల కాలం నుంచి యుద్ధానికి ముగింపు పలికే దిశగా” పయనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు చర్చలు, దౌత్యమే ఏకైక ఆచరణీయ మార్గమని భారత్‌ అనుసరిస్తున్న సూత్రప్రాయ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.

ప్రాంతీయ అనుసంధాన ప్రాజెక్టులు అన్ని సభ్య దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను తప్పనిసరిగా గౌరవించాలని ప్రధాని మోదీ సూచించారు. అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కీలక సాంకేతికతలు, సంప్రదాయ వైద్యం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ప్రతిపాదించారు.

By Rajini