
DSports 28 Nov:హైదరాబాద్: 2025సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-2 తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో, మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిన్న (గురువారం) తన యూట్యూబ్ షో ‘యాష్ కీ బాత్’ ద్వారా గంభీర్‌కు గట్టి మద్దతుగా నిలిచారు.
ఓటమికి కోచ్‌ను నిందించడం సరికాదని, ఆటగాళ్లే తమ బాధ్యతను గుర్తించాలని అశ్విన్ స్పష్టం చేశారు.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ పరాజయం పాలైన తర్వాత గౌతమ్ గంభీర్ వ్యూహాలపై, జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో అశ్విన్ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
