
DNews: 10Nov: 31 మంది దొంగల ముఠా .. వారి నుంచి స్వాధీనం చేసుకున్న 703 అధునాతన సెల్ఫోన్లు.. విలువ రూ.2 కోట్లు.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన ఓ సెల్ఫోన్ దొంగల ముఠా నేపథ్యమిది. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 4,615 సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రద్దీ ప్రాంతాల్లో సెల్ఫోన్లను చోరీ చేయడం దగ్గరి నుంచి.. దక్షిణ సూడాన్ లాంటి ఆఫ్రికా దేశాలకు తరలించే వరకు అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్లో డీసీపీ స్థాయి అధికారిపైనే సెల్ఫోన్ దొంగలు దాడికి తెగబడటంతో ఈ ముఠాల దందా చర్చనీయాంశమైంది.
రద్దీ ప్రాంతాలే లక్ష్యం
వృత్తిరీత్యా ఫొటోగ్రాఫరైన బషీర్ ఖెల్ టౌన్షిప్ ఎదురుగా ఉన్న రద్దీ ప్రాంతంలో ఫొటోలు తీస్తున్నారు..జనం గుంపులుగా ఉండటంతో ఇదే అదనుగా ఓ దొంగ ఆయన జేబులో నుంచి రూ.1.2 లక్షల విలువైన సెల్ ఫోన్ కొట్టేశాడు. బషీర్ తేరుకొని అక్కడే ఉన్న మరొకరి ఫోన్ ద్వారా తన నంబర్ కు ఫోన్ చేసేసరికే స్విచ్ఎఫ్ అని వచ్చింది. ఇలాంటి అనుభవాలు నగరంలో నిత్య కృత్యం. స్నాచింగ్ ముఠాలు పదుల సంఖ్యలో ఫోన్లను తస్కరిస్తుండటంతో బాధితులు లబోది బోమంటున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సిని మాహాళ్లు.. లాంటి రద్దీ ప్రాంతాల్లోనూ ఫోన్ల చోరీ మామూలు విషయంగా మారింది. కొందరు దొంగలు ప్రయాణికుల్లా బస్సుల్లో ఎక్కుతూ ఫోన్ కొట్టేసి వెంటనే దిగిపోతు న్నారు. అయితే వీరంతా దందాలో చిన్నచేపలు మాత్రమే. వీరి వెనకుండి నడిపిస్తున్న ముఠాలు చాలానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దొంగ లకు ముందే డబ్బులిచ్చి మరీ చోరీలు చేయిస్తు న్నాయి. అలా కొట్టేసిన ఫోన్లను ఎట్టి పరిస్థి తుల్లో తిరిగి ఆన్ చేయకుండా జాగ్రత్తలు తీసు కుంటున్నారు.
కార్గో.. షిప్.. సూడాన్
చోరీ చేసిన సెల్ ఫోన్లను వాటి మోడల్ను బట్టి ధర నిర్ణయించి కొనే ముఠాలు కొన్ని అబిడ్స్ జగదీశ్ మార్కెట్ లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. పదుల సంఖ్యలో జమ అయిన తర్వాత వాటిని మరో ముఠాకు అమ్మేస్తున్నాయి. ఇక్కడే విదేశీ ముఠాలు రంగప్రవేశం చేస్తున్నాయి. కొందరు టెక్నీషియన్ల సహకారంతో వాటి ఐఎంఈఐని మార్చేసి విదేశాలకు సరఫరా చేస్తున్నారు. విమా నాల్లో కార్గో.. లేదా ముంబయి, చెన్నై తదితర ప్రాంతాల నుంచి షిప్ల ద్వారా ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ సూడాన్లో సెకండ్ హ్యాండ్ కింద అమ్మేస్తున్నారు.. ఆయా దేశాల్లో అంతర్యుద్ధం నేపథ్యంలో ఈ తరహా సెల్ఫోన్లకు అక్కడ డిమాండ్ అధికంగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
