DNews: Dec 11: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టు అయ్యారు. శుక్రవారం నాడు జస్టిస్ బి.వి. నాగరత్నా నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఆయనను పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (SIT) ముందు హాజరుకావాలని, అలాగే ACP వెంకటగిరి ముందు కూడా హాజరుకావాలని సూచించింది. విచారణ సమయంలో SIT అధికారులు ప్రభాకర్ రావును హింసించరాదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా, ఆయన కస్టడీలో ఉన్న సమయంలో ఇంటి నుండి ఆహారం తీసుకెళ్లే అనుమతిని కూడా ఇచ్చింది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభాకర్ రావును 14 రోజులపాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. గతంలో ప్రభాకర్ రావుకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై వాదనలు నవంబర్ 18న జరగాల్సి ఉన్నప్పటికీ, ఆయన న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి గురువారం ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రభాకర్ రావు కీలక ఆధారాలను ధ్వంసం చేశారని, విచారణలో సహకరించడం లేదని, డిజిటల్ పరికరాలు, పాస్‌వర్డులు ఇవ్వడానికి నిరాకరించారని కోర్టుకు వివరించారు. గతంలో సుప్రీం కోర్టు ఆయన iCloud మరియు పాస్‌వర్డులను ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రీసెట్ చేయాలని ఆదేశించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో ప్రతిపక్ష నేతలతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్ల మద్దతు లభించడంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ నిజాన్ని వెలికితీయడానికి SIT‌ను ఏర్పాటు చేసింది. ఈ SIT అనేకమంది సీనియర్ అధికారులను విచారించి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నిర్ధారించింది. పలువురు అధికారులు అరెస్టు అయ్యారు. అయితే, ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. ఆయనను తిరిగి భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అనంతరం ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించి SIT అధికారులు తనను అరెస్టు చేయరాదని కోరారు. కోర్టు ముందస్తు అరెస్టు చేయరాదని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. భారత్‌కు తిరిగి వచ్చిన ప్రభాకర్ రావు SIT విచారణకు హాజరైనప్పటికీ, ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అనంతరం ఆయన బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కోర్టు బెయిల్ మంజూరు చేసిందినేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న కోర్టు ప్రభాకర్ రావును పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana