D Educt: Sept 24: ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి గడువు ప్రకటించింది. విద్యార్థులు గురువారం నుంచి అక్టోబరు 29 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

అనంతరం అక్టోబరు 30 నుంచి నవంబరు 10 వరకు రూ.1,000 అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. నిర్ణీత గడువులోగా విద్యార్థులు ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని బోర్డు సూచించింది.

థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ.275 ఫీజుగా నిర్ణయించారు. బ్రిడ్జ్‌ కోర్సు సబ్జెక్టులకు రూ.165, రెండో సంవత్సరం వృత్తివిద్య బ్రిడ్జ్‌ కోర్సు ప్రాక్టికల్స్‌కు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది.

మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు కలిపి హాజరయ్యే విద్యార్థులు మొత్తం రూ.1,200 పరీక్ష ఫీజుగా చెల్లించాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి సూచించింది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana