DET:DEC 01:
పారియా ఓటీటీ విడుదల: విక్రమ్ ఛటర్జీ యాక్షన్-థ్రిల్లర్‌ను ఎప్పుడు,ఎక్కడ చూడవచ్చు?
బెంగాలీ సినిమా నుంచి వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పారియా’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం,ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది.ముఖ్యంగా జంతు హక్కులు,వీధి కుక్కల పట్ల మానవ క్రూరత్వం అనే సున్నితమైన అంశాన్ని ప్రధానంగా తీసుకుని దర్శకుడు తథాగత ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

విడుదల తేదీ & ఓటీటీ వేదిక వివరాలు:
విక్రమ్ ఛటర్జీ ప్రధాన పాత్ర పోషించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా డిసెంబర్ 5,2025 నుంచి ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.అంతకుముందు 2024 లో ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.బెంగాలీ భాషలో ఉన్నప్పటికీ తెలుగు వీక్షకులు కూడా డబ్బింగ్ లేదా సబ్ టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని జీ5లో చూడవచ్చు.ఈ సినిమా 2024 జూలై 12 నుంచే హోయిచోయ్ అనే మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులో ఉంది.అయితే ప్రస్తుతం జీ5 లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

కథా నేపథ్యం: వీధి కుక్కల కోసం జాన్ విక్ తరహా పోరాటం
పారియా అంటే అర్థం వీధి కుక్కలు లేదా సమాజం నుంచి వెలివేయబడిన జీవులు.ఈ సినిమా కథ ఒక వీధి కుక్క కనిపించకుండా పోవడం చుట్టూ తిరుగుతుంది.ఒంటరిగా ఉండే ఒక వ్యక్తి ఒక వీధి కుక్కపిల్లను దత్తత తీసుకుంటాడు.అది అకస్మాత్తుగా మాయమవడంతో దాన్ని వెతకడం మొదలుపెడతాడు.అతని భావోద్వేగాల అన్వేషణ నెమ్మదిగా కోల్‌కతా నుంచి ఈశాన్య భారతదేశం వరకు విస్తరించి ఉన్న ఒక భయంకరమైన కుక్కల అక్రమ రవాణా నెట్‌వర్క్ లోకి దారి తీస్తుంది.అప్పుడు ఆ సామాన్య వ్యక్తి మూగజీవాలకు న్యాయం చేయాలని వాటిని రక్షించాలని ఒక కఠినమైన యాక్షన్ హీరోగా మారతాడు.దీన్ని చూసిన చాలా మందికి హాలీవుడ్ చిత్రం ‘జాన్ విక్’ ను గుర్తుచేస్తుంది. ఇందులో విక్రమ్ ఛటర్జీ తన పవర్-ప్యాక్డ్ నటనతో ఆకట్టుకున్నాడు.

నటీనటులు & సీక్వెల్ ప్రకటన
:
ఈ సినిమాలో విక్రమ్ ఛటర్జీతో పాటు అంగన రాయ్,శ్రీలేఖ మిత్ర,అంబరీష్ భట్టాచార్య ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమా తొలి భాగం మంచి విజయం సాధించడంతో దర్శకుడు తథాగత ముఖర్జీ ఇప్పటికే దీనికి సీక్వెల్ అయిన Pariah Volume 2: Rise of Kalbhairav ను ప్రకటించారు.ఈ సీక్వెల్ వచ్చే ఏడాది 2025 లో విడుదల కానుంది.