
DSports 22Apr 2026: హైదరాబాద్: సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అప్రతిహత విజయ పరంపర కొనసాగుతోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఈ సీజన్‌లో వరుసగా మూడవ విజయాన్ని (హ్యాట్రిక్) తన ఖాతాలో వేసుకుంది.
- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 68 బంతుల్లోనే 135 పరుగులు (10 ఫోర్లు, 10 సిక్సర్లు) చేసి అజేయ సెంచరీతో ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 37*) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
- 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో నితీష్ రాణా (57), సమీర్ రిజ్వీ (41) పోరాడినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు.
