D Educt: Sept 28: 2026-27 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్‌ ఎన్నారై కోటా, అలాగే ప్రైవేట్‌, నాన్‌-మైనారిటీ వైద్యకళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన అభ్యర్థులందరూ తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబరు 27న ప్రకటించింది.

అర్హత కలిగిన అభ్యర్థులు సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా ఆన్‌లైన్‌లో తమ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. నిర్ణీత గడువులోగా ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు తెలిపారు.