
D Spiritual: Dec 20: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక దర్శనాలను పురస్కరించుకుని డిసెంబర్ 23వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం రోజున ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈసారి డిసెంబర్ 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
