DSports 1 Dec:రాంచీ: టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తారంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది. తాను కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడతానని, టెస్టుల్లోకి పునరాగమనం చేసే ఆలోచన లేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.

దక్షిణాఫ్రికాతో రాంచీలో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీ (135 పరుగులు) చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం, పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించారు.

వ్యాఖ్యాత ప్రశ్న: “మీరు ఇప్పుడు కేవలం ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నారు. ఇదే పద్ధతి కొనసాగుతుందా? మీ నిర్ణయాన్ని పునరాలోచించుకునే అవకాశం ఉందా?” అని వ్యాఖ్యాత అడిగారు.

కోహ్లీ సమాధానం: దీనికి కింగ్ కోహ్లీ బదులిస్తూ, “అవును, నేను ఒకే ఫార్మాట్‌లో మాత్రమే ఆడతాను. నా నిర్ణయం ఎప్పుడూ అలాగే ఉంటుంది” అని తేల్చి చెప్పారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana