చిన్నారులకు నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి శస్త్రచికిత్సలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న చిన్నారులకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా నిమ్స్‌లో ఏటా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పీడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో నిమ్స్‌ కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగాధిపతి అమరేశ్వర్‌ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు వివరించారు.

శస్త్రచికిత్సలకు అవసరమైన వైద్య పరీక్షలను నిమ్స్‌ పాత బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్న సీటీ సర్జరీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ముందస్తు అపాయింట్‌మెంట్‌ అవసరం లేదని, తల్లిదండ్రులు చిన్నారులను నేరుగా నిమ్స్‌కు తీసుకురావచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 040-23489025 నంబర్‌ను సంప్రదించాలని నిమ్స్‌ అధికారులు సూచించారు.

By Rajini

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana