DSport Dec26 2025:న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో గతంలో రాజ్యమేలిన బంధుప్రీతి, అవినీతికి తమ ప్రభుత్వం తెరదించిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌’ ముగింపు వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014కు ముందు క్రీడల్లో రాజకీయ జోక్యం, సిఫార్సులకే ప్రాధాన్యం ఉండేదని, కానీ గత పదేళ్లలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు.గతంలో పిల్లలు ఆడుకుంటుంటే తల్లిదండ్రులు తిట్టేవారని, కానీ ఇప్పుడు క్రీడల ద్వారా కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సమాజం గుర్తిస్తోందని మోదీ అన్నారు. ప్రతి గ్రామం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడమే ‘ఖేలో ఇండియా’ మరియు ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ వంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.