
D News: Aug 7: ఏపీ చేనేత దినోత్సవం: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగ పునరుద్ధరణతో పాటు నేతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. చేనేత కళ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, దానిని పరిరక్షించి మరింత అభివృద్ధి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు సీఎం తెలిపారు. మగ్గాల నిర్వహణ భారం తగ్గించేందుకు విద్యుత్ రాయితీలు అందించడంతో పాటు, 50 ఏళ్ల వయస్సు నుంచే పింఛన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నట్లు వెల్లడించారు.
అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25,000 చొప్పున నేరుగా ఆర్థిక సాయం అందిస్తూ, మొత్తం రూ.179 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
