
DET:NOV 10:
రష్మిక మందన్న కొరియన్ డ్రామాపై ఆసక్తి!
పుష్ప చిత్రంలోని శ్రీవల్లిగా,అలాగే ఇటీవలి ది గర్ల్‌ఫ్రెండ్ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న నటి రష్మిక మందన్న తన నటనలో వైవిధ్యాన్ని ఎప్పుడూ కోరుకుంటారు.ఈ మధ్యకాలంలో ఆమె తన అభిమానులతో పంచుకున్న ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,ఆమె కొరియన్ డ్రామాలో నటించాలని కలలు కంటున్నారట.ఆమెకు కొరియన్ సంస్కృతిపై ఉన్న మక్కువ అందరికీ తెలిసిందే.
కొరియన్ డ్రామా అంటే సరదా అనుభవం:
రష్మిక ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ,తనకు కొరియన్ డ్రామాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, అయితే అది సరదాగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.అయితే,ఆమె తన స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని,కాబట్టి ఆ పాత్ర మరియు కథ తనకు నచ్చితేనే ఒప్పుకుంటానని స్పష్టం చేశారు.వాళ్ళు నాకు ఎలాంటి పాత్ర ఇస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది,ఎందుకంటే నా పాత్రల విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో మీ అందరికీ తెలుసు,అని ఆమె అన్నారు.
K-డ్రామాలపై ప్రేమ ఎలా మొదలైంది?
రష్మిక తన కొరియన్ డ్రామాలపై ఇష్టాన్ని గుర్తు చేసుకుంటూ,ఈ ప్రేమ కోవిడ్-19 సమయంలో మొదలైందని తెలిపారు.ఆ సమయంలో చేతిలో చాలా ఖాళీ సమయం ఉండటం వల్ల K-డ్రామాలు చూడటం ప్రారంభించారట.సాధారణంగా ప్రతి కొరియన్ డ్రామాలో 16 ఎపిసోడ్లు ఉంటాయని,అంటే సుమారు 16 గంటలు చూడాల్సి వస్తుందని,అప్పుడే ఆ అలవాటు మొదలైందని ఆమె నవ్వుతూ చెప్పుకున్నారు.
