
DSports Dec23 2025: విజయవాడ: నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్టు అదరగొట్టింది. సోమవారం జరిగిన మహిళల టీమ్ విభాగం సెమీఫైనల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు నాయకత్వంలోని ఏపీ జట్టు గుజరాత్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.
సింధు జోరు టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు తన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి జట్టుకు శుభారంభం అందించారు.డబుల్స్‌లోనూ సత్తాకేవలం సింగిల్స్‌లోనే కాకుండా, కవిప్రియతో కలిసి ఆడిన డబుల్స్ మ్యాచ్‌లోనూ సింధు అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.యువ క్రీడాకారిణుల ప్రతిభ విజయవాడకు చెందిన మరో క్రీడాకారిణి టి. సూర్యచరిష్మ కూడా తన సింగిల్స్ మ్యాచ్‌లో విజయం సాధించి ఏపీ జట్టు ఫైనల్ చేరడంలో తోడ్పడ్డారు.
