Nani to Produce Dulquer Salmaan’s Next Movie? New Project in the Works

D News: నేచురల్ స్టార్ నాని హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా.. నిర్మాతగానూ ఆసక్తికర ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా నిర్మించేందుకు నాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దుల్కర్ కోసం కథ రెడీ!

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించే ఈ ప్రాజెక్ట్‌ను నాని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించనున్నట్లు టాక్. యువ దర్శకుడు రామ్ జగదీష్ ఈ సినిమాకు కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. పూర్తి కథను దుల్కర్‌కు వినిపించిన తర్వాత ప్రాజెక్ట్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో నాని ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇవ్వడంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి పెరిగింది.

దుల్కర్‌తో నానికి మంచి బాండింగ్

నాని, దుల్కర్ సల్మాన్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. నాని నటించిన ‘ది ప్యారడైజ్’ను దుల్కర్‌కు చెందిన వేఫెరర్ ఫిల్మ్స్ కేరళలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇప్పుడు నాని నిర్మాణంలో దుల్కర్ హీరోగా సినిమా వస్తే ఈ కాంబినేషన్ మరింత ఆసక్తికరంగా మారనుంది.

ప్రస్తుతం దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’తో బిజీగా ఉన్నారు. మరోవైపు నాని నిర్మాణంలో ‘అలియాస్ జానకి’, చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కూడా రూపొందుతున్నాయి.

By Avinash