
D News:నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. సినిమా విజయంతో చిత్రయూనిట్ మొక్కులు చెల్లించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా నాని, శ్రీకాంత్ ఓదెల ములుగు జిల్లాలోని ప్రసిద్ధ మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.
సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు
మేడారం వెళ్లే ముందు నాని, చిత్రబృందం గట్టమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మేడారం చేరుకుని వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ బరువుకు తూగేంత నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్గా ఫొటోలు
నాని, శ్రీకాంత్ ఓదెల మేడారం పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘దసరా’ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతోంది.
