
DNews: Nov22: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో బయలుదేరి పుట్టపర్తి చేరుకున్నారు. రాష్ట్రపతితో పాటు పుట్టపర్తిలో జరుగుతున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో సీఎం, ఇతర మంత్రులు పాల్గొంటారు. ప్రముఖుల రాకతో పుట్టపర్తి అంతటా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కాన్వాయ్ల మార్గంలో గట్టి నిఘా ఉంచారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాల్లోని సత్యసాయి మహాసమాధిని సందర్శించారు.
