
DNews: Dec23: తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన చెన్నమనేని గమన సాత్విక మిస్ ఆంధ్రగా ఎంపికైంది. ఆదివారం రాత్రి జైపూర్‌లో ఫరెవర్ స్టార్ ఇండియా నిర్వహించిన అందాల పోటీలో సాత్విక దేశ (మిస్ ఇండియా) స్థాయిలో నాల్గవ స్థానంలో, ఏపీలో మొదటి స్థానంలో నిలిచింది. 22 ఏళ్ల సాత్విక గతంలో ఇదే పోటీలో మిస్ తిరుపతిగా ఎంపికైంది. సాత్విక తల్లి నెల్లూరు జిల్లా కోర్టులో పనిచేస్తుండగా, ఈమె తిరుపతి జిల్లా వెంకటగిరి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ సీసీ నాయుడి కుమార్తె.
