
DNews: Jan29: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన భౌతికకాయాన్ని బారామతిలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్, మంత్రి అంగాని సత్య ప్రసాద్, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి హాజరయ్యారు. ముందుగా వారు అజిత్ పవార్ మృతదేహాన్ని సందర్శించారు. తరువాత నివాళులర్పించారు. ఆ తర్వాత బారామతిలో జరిగిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
