DSports 18Feb 2026:అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ఆగులేకుండా దూసుకుపోతోంది. గ్రూప్-ఎలో వరుసగా యూఎస్ఏ, నమీబియా, మరియు నిన్న పాకిస్థాన్‌పై సాధించిన ఘన విజయాలతో సూపర్-8 బెర్త్‌ను ఇప్పటికే ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో, గ్రూప్ దశలో తన ఆఖరి మ్యాచ్‌ను నేడు (ఫిబ్రవరి 18) నెదర్లాండ్స్‌తో ఆడనుంది.

  • ఆదివారం శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన సూర్యకుమార్ యాదవ్ సేన, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో డచ్ జట్టును ఎదుర్కోనుంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గి 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ‘క్లీన్ స్వీప్’ (4-0)తో సూపర్-8లోకి ఘనంగా ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
  • సూపర్-8 చేరడంతో, నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ తన బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది.వరుస మ్యాచుల నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక బౌలర్లకు విశ్రాంతి ఇచ్చి, మహమ్మద్ సిరాజ్ లేదా హర్షిత్ రాణాను ఆడించే ఛాన్స్ ఉంది.ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటం జట్టుకు కొంత ఆందోళన కలిగిస్తోంది. సూపర్-8 మ్యాచులకు ముందు అతను ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అత్యవసరం.