
D Educt: Nov 5: ప్రభుత్వ పాఠశాలల్లో నవంబరు 6, 7 తేదీల్లో ఎఫ్ఎల్ఎన్ మిడ్లైన్ పరీక్షలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు నవంబరు 6, 7 తేదీల్లో ఎఫ్ఎల్ఎన్ (FLN) మిడ్లైన్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆన్లైన్ విధానంలో మొబైల్ ఫోన్లు, ట్యాబ్ల ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8.32 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణలో 56,678 మంది సిబ్బంది పాల్గొననున్నారు. విద్యార్థుల ప్రాథమిక అభ్యసన స్థాయిని అంచనా వేసి, వారి సామర్థ్యాల్లో వచ్చిన మార్పులను గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడనున్నాయి.
ఇప్పటికే జులైలో విద్యార్థులకు బేస్లైన్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. వాటి ఫలితాలతో మిడ్లైన్ పరీక్షల ఫలితాలను పోల్చి విద్యార్థుల అభ్యసన పురోగతిని అంచనా వేయనున్నారు.
