
D News: దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆస్మాన్’. రామ్ నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హారర్ మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
మిస్టరీ, యాక్షన్‌తో టీజర్
“మీరిప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోకచిలుక దశలోకి మారాలి” అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ ఆసక్తిని పెంచుతోంది. చర్చి బ్యాక్‌డ్రాప్, మిస్టరీ ట్రాన్స్‌లో ఉన్న వ్యక్తులు, హీరోయిన్ కోసం హీరో చేసే పోరాట సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. రగ్గడ్ లుక్‌లో కనిపించిన మేఘాంశ్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు.
పలు భాషల్లో విడుదలకు సన్నాహాలు
శ్రీ క్లింకార సెల్యులాయిడ్ బ్యానర్‌పై కొండారు శ్రీనివాస్ రావు సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో మేఘాంశ్ సరసన రాయంచ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవి వర్మ, కమల్ కేశవ, దీపక్, నిఖిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, అరబిక్ భాషల్లోనూ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. శ్రీహరి వారసుడిగా మేఘాంశ్ ‘ఆస్మాన్’తో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి.
