
DET:MAR 07:
రై రై రా రా లో చరణ్ రుద్రతాండవం మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే?
మార్చి 3, 2026న ఈ పాటను చూసిన చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.స్క్రీన్‌పై చరణ్ అంత వేగంగా అత్యంత సులభంగా కదులుతుంటే చూడటం ఒక కంటి పండుగలా ఉంది.ఒక తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు.ఈ పాటలో చరణ్ ఎనర్జీ లెవల్స్ హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్నాయని ఆయన కొనియాడారు.
హై ఫీవర్‌లో కూడా డ్యాన్స్!
ఈ పాట వెనుక ఉన్న ఒక ఆసక్తికర విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా బయటపెట్టారు.ఈ పాట షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు 102 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గకుండా ఆ అద్భుతమైన స్టెప్పులు వేశారని తెలిపారు.చరణ్ డెడికేషన్ చూసి యూనిట్ అంతా ఆశ్చర్యపోయారు.ఈ పాటను జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ & అనంత్ శ్రీరామ్ లిరిక్స్:
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన ఈ హై-ఎనర్జీ బీట్ ప్రేక్షకులను ఊపేస్తోంది.ముఖ్యంగా లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ఎక్కడా ఇంగ్లీష్ పదాలు వాడకుండా అచ్చ తెలుగు పదాలతో ఈ పాటను రాయడం విశేషం.పాతేసుకోకోయలా.. నువ్వు నిన్నే నీ లోపల.. పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా అనే లైన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏప్రిల్ 30న థియేటర్లలోకి!
రామ్ చరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఏప్రిల్ 30,2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
