
DSpecial article 06 Nov :భారత బాక్సింగ్‌లో మేరీ కోమ్ ( పేరు ఒక సంచలనం. ఆమె కేవలం క్రీడాకారిణి మాత్రమే కాదు, కోట్లాది మందికి స్ఫూర్తి కూడా. మహిళల బాక్సింగ్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టి,2016లో భారత రాష్ట్రపతి చేత రాజ్యసభకు (పార్లమెంటు ఎగువ సభ) సభ్యురాలిగా నామినేట్ అయ్యారు.ఆమెకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాలు అందించింది:భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు.మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా 2014లో నటి ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో ‘మేరీ కోమ్’ సినిమా విడుదలైంది.
మేరీ కోమ్ ముగ్గురు పిల్లల తల్లి అయినప్పటికీ, ఫ్యామిలీ లైఫ్‌ను, అద్భుతమైన క్రీడా కెరీర్‌ను విజయవంతంగా బ్యాలెన్స్ చేయగలిగారు. గర్భం దాల్చిన తర్వాత, బరువు పెరిగినా కూడా తిరిగి బరువు తగ్గి ప్రపంచ స్థాయిలో పోటీపడి విజయం సాధించడం ఆమె సంకల్పానికి, అంకితభావానికి నిదర్శనం. నిరంతర పోరాటం, పట్టుదల ద్వారా చిన్న గ్రామం నుంచి వచ్చిన ఒక మహిళ ప్రపంచాన్ని జయించవచ్చని ఆమె నిరూపించారు.
