
D News: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మమిత బైజు పేరు బాగా వినిపిస్తోంది. తక్కువ సమయంలోనే వరుస అవకాశాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఏడాది తిరగకుండానే తాను నటించిన సినిమాల కలెక్షన్లతో ఏకంగా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరినట్టు టాక్ నడుస్తోంది. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆమె పాత్రలు మాత్రం ప్రత్యేకంగా గుర్తుండిపోవడం విశేషం.
వరుస సినిమాలతో భారీ కలెక్షన్స్
మమిత నటించిన ‘బెత్లహోం కుటుంబ యూనిట్’ మాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకోగా.. సూర్య హీరోగా వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద రూ.260 కోట్లు రాబట్టినట్టు సమాచారం. అలాగే విజయ్ నటించిన ‘జన నాయగన్’ రూ.300 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. గతేడాది ప్రదీప్ రంగనాథ్‌తో చేసిన ‘డ్యూడ్’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.
ఇక ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కర’ చిత్రం రూ.55 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్టు సమాచారం.
హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా..
బాక్సాఫీస్ ఫలితాలను పరిశీలిస్తే ‘కర’, ‘జన నాయగన్’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని సమాచారం. మరోవైపు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘బెత్లహోం కుటుంబ యూనిట్’ మంచి విజయాలు సాధించాయి. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా.. మమిత బైజు పోషించిన పాత్రలు, ఆమె నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం విశేషం. దీంతో సౌత్‌లో ఈ యువ నటికి వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.
