D Educt: Aug 19: NTAలో భారీ ప్రక్షాళన.. ప్రశ్నపత్రాల తనిఖీకి నాలుగు అంచెల విధానం

ప్రవేశ పరీక్షల నిర్వహణ వ్యవస్థలో కేంద్ర విద్యాశాఖ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. పరీక్షల నిర్వహణలో లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు, UGC-NET పరీక్షల్లో తలెత్తిన సమస్యల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రశ్నపత్రాల నాణ్యత, భద్రతను పెంచేందుకు నాలుగు అంచెల తనిఖీ విధానాన్ని అమలు చేయనుంది.

NTA డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ సంస్థలో చేపట్టిన చర్యలను కేంద్ర విద్యాశాఖకు వివరించారు. పరీక్షల నిర్వహణ బృందాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించే చర్యల్లో భాగంగా సుమారు 600 మంది నిపుణులను తొలగించి, వారి స్థానంలో కొత్త నిపుణులను నియమించనున్నారు. ప్రశ్నపత్రాల్లో పొరపాట్లు, లోపాలు లేకుండా చూసేందుకు నాలుగు దశల్లో తనిఖీ చేసే వ్యవస్థను తీసుకురానున్నారు.

NTAలో వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో మరో 20-25 మంది అధికారులను నియమించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. భవిష్యత్‌లో మరిన్ని నియామకాలు చేపట్టే అంశంపైనా సమీక్ష నిర్వహించినట్లు తెలిపింది. అంతేకాకుండా NTA కార్యాలయాలను కొత్త భవనాలకు యుద్ధప్రాతిపదికన తరలించనున్నారు. కార్యాలయాల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందిని కూడా మోహరించనున్నారు.

NEET-UG ప్రశ్నపత్రం లీకేజీ వివాదం, ఇటీవల UGC-NET పరీక్షల్లో తలెత్తిన సమస్యలపై కేంద్ర విద్యాశాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తడంతో NTAలో సంస్కరణలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రల్హాద్ జోషి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో పరీక్షల నిర్వహణకు అవసరమైన భద్రతా, మౌలిక సదుపాయాలను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

47 మంది అధికారులపై NTA వేటు

ఇటీవల UGC-NET జూన్ 2026 పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల్లో పరీక్షలను మళ్లీ నిర్వహించాలని NTA ప్రకటించింది. ఈ మూడు ప్రశ్నపత్రాల్లో వాస్తవపరమైన తప్పులు, టైపింగ్ పొరపాట్లు, అనువాద లోపాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిపుణుల కమిటీ గుర్తించింది. దీంతో ఆ ప్రశ్నపత్రాలు న్యాయమైన, లోపరహిత పరీక్ష ప్రమాణాలకు అనుగుణంగా లేవని కమిటీ తేల్చింది.

పరీక్షల నిర్వహణలో లోపాలపై చర్యల్లో భాగంగా జూలైలోనే 47 మంది NTA అధికారుల సేవలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా మరో 600 మంది నిపుణులను తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియను ప్రారంభించింది. దీంతో NTAలో భారీ స్థాయిలో ప్రక్షాళన జరుగుతోంది.

పేపర్ లీక్‌పై కఠిన చర్యలు

పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు-2026ను పార్లమెంట్ ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల్లో ఆమోదించింది. పేపర్ లీకేజీ కేసుల్లో కఠిన శిక్షలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, నిర్ణీత గడువులో విచారణ వంటి నిబంధనలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.

NEET-UG పేపర్ లీకేజీ, నిరసన చేస్తున్న విద్యార్థులపై జూలై 20న జరిగిన పోలీసు చర్యల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొన్న తర్వాత ఈ బిల్లుకు ఆమోదం లభించింది. మొత్తంగా NTAలో చేపడుతున్న తాజా సంస్కరణలు పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, ప్రశ్నపత్రాల నాణ్యతను పెంచడమే లక్ష్యంగా సాగుతున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana